నటనపై ఆసక్తి లేదు … ప్రజల కోసమే జనసేన

212
Pawan Kalyan Full Speech In Harvard University
- Advertisement -

ప్రజాసమస్యలపై పోరాడటమే తనకు నిజమైన సంతృప్తి నిస్తోందని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు.  న్యూహంప్‌షైర్‌లో మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమంలో మాట్లాడిన పవన్‌  తనకు రాజకీయాలపై పెద్దగా అవగాహన లేదన్నారు. కానీ సమాజాన్ని చదవడం అలవాటుగా మారిందని … ఎక్కడ అన్యాయం జరిగిన బాధితుల తరపున నిలబడతానని స్పష్టం చేశారు.

సినిమాల కంటే ప్రజల తరపున పోరాడటాన్ని ఇష్టపడతానని తెలిపారు. సినిమాల్లో తాను ఎప్పుడూ సౌకర్యంగా ఫీలవలేదన్నారు.  సమస్యను సరిగా అడ్రస్‌ చేయనప్పుడు అది ఉద్యమంగా మారుతుందన్నారు. రాజకీయనాయకుల్లో ఉన్న ఈ లక్షణమే తనకు నచ్చదన్నారు పవన్‌. ప్రజల పక్షాన నిలబడేందుకే… జనసేనను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రామానికి పెద్ద ఎత్తు పవన్‌ ఫ్యాన్స్‌ హాజరైయ్యారు. పవర్‌ స్టార్‌ అంటూ నినాదాలతో హోరెత్తించారు. కుల రాజకీయాలు తనకు నచ్చవని, అన్యాయాన్ని చూస్తూ కూర్చోలేనని పవన్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
ఇక అమెరికా పర్యటనలో భాగంగా పవన్‌ అంతర్జాతీయ రాజకీయ వ్యూహకర్త స్టీవ్‌ జార్డింగ్‌తో నిన్న సమావేశమయ్యారు.  రెండు గంటలకుపైగా జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు.  2019 శాసనసభ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయోనన్న విషయాన్ని ఈ సందర్భంగా జార్డింగ్‌ వివరించినట్లు జనసేన ఒక ప్రకటనలో తెలిపింది. ఎలాంటి ఎత్తుగడలు అవలంబించాలి, అభ్యర్థుల ఎంపిక ఎలా జరగాలి వంటి వివరాలను విశ్లేషణాత్మకంగా తెలియజేశారని పేర్కొంది. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలోని కెనడీ స్కూల్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జార్డింగ్‌ అమెరికాలోని రాజకీయ పార్టీలతోపాటు అంతర్జాతీయంగా వివిధ పార్టీల రాజకీయ నేతలకు సూచనలు, సలహాలను అందిస్తున్నారు. విజయవంతమైన రాజకీయ వ్యూహకర్తగా పేరు గడించిన ఆయన నుంచి ములాయంసింగ్‌ ఆధ్వర్యంలోని సమాజ్‌వాదీ పార్టీ సలహాలు స్వీకరిస్తోంది.

- Advertisement -