తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ విద్యుత్ చట్ట సవరణ బిల్లు విషయంలో వెనక్కు తగ్గలేదు. శుక్రవారం అన్ని రాష్ట్రాల అధికారులతో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి సమావేశమైయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ సమావేశానికి ట్రాన్స్ కో సీఎండీ డి.ప్రభాకర్ రావు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సవరణ బిల్లులో వ్యవసాయానికి మీటర్లు బిగించబోమని కేంద్రం చెప్పడాన్ని మాత్రమే స్వాగతించామన్నారు ట్రాన్స్ కో అండ్ జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు
ఫిబ్రవరి 17న ఢిల్లీలో అన్ని రాష్ట్రాల అధికారులతో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి సమావేశమై బిల్లు ఉద్దేశ్యాలను వివరించి అభిప్రాయాలు సేకరణ చేశారని తెలిపారు. అయితే ఆ సమయంలో బిల్లును తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తున్నట్టుగా రికార్డుల్లో నమోదు చేసిందని.. ఇది పూర్తి అవాస్తవం అంటున్నారు సీఎండీ ప్రభాకర్ రావు విద్యుత్ ఉద్యోగులు సర్ ప్లస్ ఉన్నారని.. వారి సంక్షేమనికి సంబంధించిన అంశంతో పాటు renewable power obligation కి సంభందించిన అంశాలను లేవనెత్తింది తెలంగాణ ప్రభుత్వం.