సాగర్‌లో బీజేపీకి మరోషాక్…టీఆర్ఎస్‌లోకి నివేదితారెడ్డి!

272
Kankanala Niveditha Reddy . ( Credit : Niveditha Reddy/facebook)
- Advertisement -

సాగర్ ఉప ఎన్నికల వేళ బీజేపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు పార్టీ నాయకత్వ తీరును నిరసిస్తూ టీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నేత కడారి అంజయ్య కారు ఎక్కెందుకు రంగం సిద్ధం చేసుకోగా తాజాగా ఆ జాబితాలో చేరారు నల్గొండ బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి, ఆయన సతీమణి కంకణాల నివేదిత రెడ్ది.

అభ్యర్థుల ఖరారు అంశంలో బీజేపీ ఆచితూచి వ్యవహరించి, రవికుమార్‌(ఎస్టీ వర్గం)కు టికెట్‌ ఇవ్వగా మొదటి నుండి టికెట్ ఆశీంచిన నివేదిత తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇప్పటికే నామినేషన్ కూడా దాఖలు చేసిన ఆమె…బండి సంజయ్ ఇచ్చిన షాక్‌తో పార్టీని వీడి కారెక్కెందుకు సిద్ధమయ్యారు. దీంతో కమలనాథులకు సాగర్ ఉప ఎన్నికల వేళ గట్టిషాక్ తగిలినట్లైంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జున సాగర్‌ బీజేపీ డిపాజిట్‌ కోల్పోయింది. అప్పుడు ఆ పార్టీ తరఫున బరిలోకి దిగన నివేదితారెడ్డికి 2,675 ఓట్లు రాగా టీడీపీ నుంచి పోటీ చేసిన కడారి అంజయ్య 27,858 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచారు.

- Advertisement -