రాష్ట్రంలో కొత్త‌గా 463 కరోనా కేసులు నమోదు

178
- Advertisement -

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్త‌గా 463 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం… ఒక్క‌రోజులో కరోనాతో న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 364 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,07,205కు పెరిగాయి. కొత్తగా 364 మంది డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 3,00,83 మంది కోలుకున్నారు. మొత్తం మృతుల సంఖ్య 1,694కు పెరిగింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.55 శాతం, రికవరీ రేటు 97.92శాతం ఉందని పేర్కొంది.

ప్రస్తుతం రాష్ట్రంలో 4,678 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 1,723 హోం ఐసోలేషన్‌లో ఉన్నారని ఆరోగ్యశాఖ పేర్కొంది. నిన్న ఒకే రోజు 42,461 కరోనా శాంపిల్స్‌ పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీలో 145, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 46, రంగారెడ్డిలో 28, నిజామాబాద్‌లో 23, జగిత్యాలలో 20, వరంగల్‌ అర్బన్‌లో 19 అత్యధికంగా పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి.

- Advertisement -