- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు తన జన్మదినం సందర్భంగా లాలాపేట లోని తన కార్యాలయంలో మొక్కలు నాటారు పాడి, పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ లోక భూమారెడ్డి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది అని తెలిపారు.
ప్రతి ఒక్కరూ కుడా బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యేలు జోగురామన్న, దుర్గం చిన్నయ్య సంస్థ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -