హీరో నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం ‘రంగ్ దే’. ‘గిమ్మీ సమ్ లవ్’ అనేది ట్యాగ్ లైన్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. భీష్మ , చెక్ తర్వాత నితిన్ నటిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు పెరిగిపోయాయి. మరీ ఆ అంచనాలను నితిన్ అందుకున్నాడో లేదో చూద్దాం..
కథ:
అర్జున్(నితిన్), అనుపమ(కీర్తిసురేష్) పక్క పక్క ఇళ్లల్లో కలిసి పెరుగుతారు. చిన్నప్పట్నుంచి అర్జున్ అంటే అనుకు చాలా ఇష్టం. ఆ ఇష్టం పెద్దయ్యేసరికి ప్రేమగా మారుతుంది. ప్రతి విషయానికి అనుని చూసి నేర్చుకో అంటూ తండ్రి అంటూండటంతో పెద్దయ్యేసరికి కోపం కాస్త ద్వేషంగా మారుతుంది. ఇద్దరూ పై చదువుల కోసం జీమేట్ ఎగ్జామ్ రాస్తారు. ఒకరు డ్రాప్ అయితేనే మరొకరికి ఆ కాలేజ్‌లో సీటు వస్తుందని తెలియడంతో అర్జున్.. అనుకి పెళ్లి చేసి పంపేస్తే తనకు దుబాయ్ వెళ్లడానికి రూట్ క్లియర్ అవుతుందని భావించి ఓ చిన్న గేమ్ ఆడుతాడు. ఇది తెలిసిన అను ఏం ప్లాన్ వేసింది…? చివరకు ఎలా ఒక్కటయ్యారు అన్నదే సినిమా కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ నితిన్,కీర్తి సురేష్,స్క్రీన్ ప్లే,కామెడీ,పాటలు. నితిన్- కీర్తీ సురేష్ నటన సూపర్బ్. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సూపర్బ్. తమ నటనతో సినిమాను మరోస్ధాయికి తీసుకెళ్లారు. వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ కామెడీ మెప్పిస్తుంది. చాన్నాళ్ల తర్వాత వినీత్ తెలుగు స్క్రీన్ మీద కనిపించారు.
మైనస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ మైనస్ పాయింట్ కథ. కలిసి పెరిగిన ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్,అలాగే దంపతుల మధ్య ఈగో క్లాషెస్, కేవలం కుటుంబ పెద్దల కోసం కలిసున్నట్టు కనిపించడం కొత్తేం కాదు. విడాకుల ప్రస్తావన ఉన్నా, విడాకులు తీసుకునే రోజుదాకా కలిసున్న కపుల్స్ కథలు కూడా కొత్త కాదు.అలాంటి కథకే కామెడీ టచ్ ఇచ్చి నడిపించాడు దర్శకుడు
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా సూపర్బ్. దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్ సినిమాకు హైలైట్. అన్నీ యూత్ మళ్లీ మళ్లీ పాడుకునేలాగానే ఉన్నాయి. కెమెరా సినిమాకు హైలైట్. రంగ్ దే అనే టైటిల్‌ని సపోర్ట్ చేసేలా ఉంది సినిమాటోగ్రఫీ. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.
తీర్పు:
లిమిటెడ్ ఆర్టిస్టులు, పక్కాగా రాసుకున్న స్క్రీన్‌ప్లే, పొందిగ్గా అల్లుకున్న సీన్స్, మంచి కామెడీ సెన్స్, టైమ్‌లీ సాంగ్స్ సినిమాకు ప్లస్ కాగా తెలిసిన కథే అవడం మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో మెప్పించే చిత్రం రంగ్‌దే.
విడుదల తేదీ:26/03/2021
రేటింగ్: 2.5/5
నటీనటులు: నితిన్, కీర్తిసురేష్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
దర్శకత్వం: వెంకీ అట్లూరి