- Advertisement -
వ్లాదిమిర్ పుతిన్…ఈ పేరు వింటేనే గుర్తుకొచ్చేది రష్యా. రెండు సార్లు రష్యా అధ్యక్షుడిగా పనిచేసిన పుతిన్..మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు రాజ్యాంగ సవరణ చేసి ముందుకెళ్తున్నారు. 2024 తో అయన పదవీకాలం ముగుస్తుండటంతో మరోసారి రాజ్యాంగ సవరణ చేసేందుకు సిద్ధమయ్యారు రష్యా అధికారులు.
రష్యా అధ్యక్షుడిగా మరో రెండు పర్యాయాలు కొనసాగేందుకు అవసరమైన చట్టసవరణ బిల్లును దిగువ సభ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఎగువ సభకూడా త్వరలోనే ఆమోదం తెలిపే అవకాశం ఉండటంతో రెండు సభల ఆమోదం తరువాత అధ్యక్షుడి హోదాలో పుతిన్ సంతకం చేయనున్నారు. అనంతరం అది చట్టంగా మారి… 2036 వరకు పుతిన్ పదవిలో కొనసాగనున్నారు.
- Advertisement -