సాగర్‌లో బీజేపీ ఓటమి ఫిక్స్..!

215
sagar
- Advertisement -

నాగార్జున సాగర్ ఎన్నికలను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో రెండు చోట్ల సాధించిన ఘన విజయంతో గులాబీ శ్రేణులు విజయోత్సాహంతో కదం తొక్కుతున్నాయి. ఇదే ఊపులో సాగర్‌‌లో కూడా మరోసారి గులాబీ జెండా ఎగరవేసి రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ఎదురులేదని చాటాలని సీఎం కేసీఆర్ ఫిక్స్ అయ్యారు. దుబ్బాకలో ఏమరుపాటుగా ఉండి బీజేపీకి అనవసరంగా ఛాన్స్ ఇచ్చాం..సాగర్ లో ఆ పొరపాటు చేయవద్దని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే సాగర్‌లో గెలుపు వ్యూ‍హాన్ని పక్కాగా రచిస్తున్నారు. ఇప్పటికే సాగర్ నియోజకవర్గంలోని 7 మండలాలకు ఎమ్మెల్యేలు, కీలక నేతలను ఇంచార్జ్‌లుగా నియమించారు. తాజాగా ఉప ఎన్నికలో గెలుపు కోసం ఏడుగురు మంత్రులను సాగర్‌లో మోహరించాలని సీఎం కేసీఆర్ డిసైడ్ అయినట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులు కేటీఆర్​, హరీశ్​రావుతో పాటుగా జగదీష్​రెడ్డి, నిరంజన్​రెడ్డి, తలసాని శ్రీనివాస్​ యాదవ్​, పువ్వాడ అజయ్​, గంగుల కమలాకర్​ లను సాగర్ ఎన్నికలయ్యే వరకు అక్కడే మకాం వేయనున్నారు.

ఇప్పటికే ప్రతి మండలానికి ఎమ్మెల్యేలను నియమించిన సీఎం… ఇప్పుడు మంత్రులకు టార్గెట్​ పెడుతున్నట్లు సమాచారం. ఇక సాగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే విషయాన్ని కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో మరోసారి భేటీ అయి తేల్చనున్నారు. సాగర్‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోటీ అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ గాలి తీసిన సీఎం కేసీఆర్ ఇక కాషాయ పార్టీని పోటీలో లెక్కలోకి తీసుకోవడం లేదు. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిని దీటుగా ఎదుర్కొనే అభ్యర్థి కోసం సీఎం కసరత్తు చేస్తున్నారు. సాగర్‌లో బలమైన అభ్యర్థి యాదవ, రెడ్డి వర్గంలో ఎవరికి టికెట్ ఇవ్వాలో సీఎం కేసీఆర్ నేతలతో సంప్రదింపులు చేస్తున్నారు. ఈ సెగ్మెంట్​లో యాదవ వర్గం ఓట్లు దాదాపు 55 వేలు ఉన్నాయి. యాదవ కులం నుంచి నోముల నర్సింహయ్య కొడుకు భగత్​తో పాటు గురువయ్య యాదవ్, రంజిత్ యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

మండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్​రెడ్డి… నోముల కొడుకు భగత్‌కే టికెట్​ ఇవ్వాలని, సామాజికవర్గం ఓట్లతో పాటుగా సానుభూతి కలిసి వస్తుందని పట్టుపడుతున్నారు. మంత్రి జగదీష్​రెడ్డి మాత్రం రెడ్డి కులం నుంచి ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఎంసీ కోటిరెడ్డి పేర్లను ప్రపోజ్​ చేస్తున్నారు. అటు బడుగుల లింగయ్య యాదవ్​ కూడా గురవయ్య యాదవ్​ కోసం సీఎం దగ్గర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం..సాగర్‌ ఉప ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభమైన నేపథ్యంలో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే గుత్తా, మంత్రి జగదీష్​రెడ్డితో పాటు నేతలను ప్రగతిభవన్​కు రావాలంటూ సమాచారమందించారు. గురవయ్యయాదవ్, నోములభరత్‌ యాదవ్‌లలో ఒకరికి టికెట్ కన్ఫర్మ్ అని టాక్. మరి సీఎం కేసీఆర్ ఎవరికి టికెట్ ఇస్తారో చూడాలి. మరోవైపు చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ సాగర్ ఉప ఎన్నికలను కూడా సీరియస్‌గా తీసుకుంటున్నారు. అందుకే 7 మండలాలకు 7 గురు ఇంచార్జ్‌లతో పాటు, ఏడుగురు మంత్రులను కూడా సాగర్‌లో మోహరిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అభ్యర్థి విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్న బండి సంజయ్‌కు సీఎం కేసీఆర్ రచిస్తున్న వ్యూహం దిమ్మతిరిగే షాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మరి టీఆర్ఎస్ వ్యూహ‍ాన్ని బండి సంజయ్ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.

- Advertisement -