- Advertisement -
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు దూసుకుపోతున్నాయి. ఏప్రిల్ 17న ఎన్నికలు జరగనుండగా నామినేషన్ల స్వీకరణకు మూడు రోజుల్లో మాత్రమే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ నెల 30 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉన్నప్పటికీ సెలవు రోజులు ఉండటంతో మూడు రోజుల్లో మాత్రమే నామినేషన్ దాఖలు చేసే ఛాన్స్ ఉంది.
27న నాలుగో శనివారం,28న ఆదివారం,29న హోలీ పండుగ ఉండటంతో ఈ నెల 25,26,30 తేదీల్లోనే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ నెల 30న నామినేషన్ దాఖలు చేసేందుకు కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి సిద్ధమవుతుండగా బీసీ అభ్యర్థిని బరిలో దింపేందుకు కసరత్తు చేస్తోంది టీఆర్ఎస్.
ఈ నెల 23న నోటిఫికేషన్ విడుదల కాగా తొలి రోజు 5,రెండో రోజు రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. మే 2న ఫలితాలు వెల్లడికానున్నాయి.
- Advertisement -