పన్ను పంపిణీ రాష్ట్రాలపై ఆదాయ లోటు ప్రభావం ఎక్కువగా ఉందని….15వ ఆర్థిక సంఘం పేర్కోన్నట్లుగా సహాయం అందించాలన్నారు ఎంపీ సంతోష్ కుమార్. బడ్జెట్ ఆమోద చర్చలో పాల్గోన్నారు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్. బడ్జెట్ లో ఎరువుల సబ్సిడీ అంశంలో విప్లవాత్మకమైన సంస్కరణలు లేవని…ప్రజాజీవన విధానంపై కరోన సంక్షోభ ప్రభావం పడిందన్నారు.
దేశంలో జీడీపీ క్రమంగా క్షిణిస్తోందని….ఆర్థిక పరిస్థితి అంశంలో మూడో త్రైమాసికంలో తిరిగి పుంజుకున్నాం అన్నారు. కరోనా కాలంలో ఆరోగ్య రంగంలో అదనపు ఖర్చులు, నిరుద్యోగంపై కేంద్రం చర్యలు తీసుకుంది….ఉపాధీహామీ పథకం, ఉచిత అహార ధాన్యాల పంపిణీపై దృష్టి సారించిందన్నారు. అర్థిక పరిస్థితిపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకున్నందుకు కేంద్ర అర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు అభినందనలు తెలిపారు.
ఆరోగ్య రంగానికి 137% కేటాయింపులు పెంచడం మంచి నిర్ణయం అని….వివిధ పథకాల నిధుల కేటాయింపు స్వాగతనీయం అన్నారు. మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 98శాతానికి పైగా ప్రతి ఇంటికి స్వచ్ఛమైని నీరు అందిస్తున్నాం….సుమారు రూ.30వేల కోట్లు కేటాయించి పథకాన్ని అమలు చేస్తున్నాం అన్నారు. డైనమిక్ లీడర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అమలు చేస్తోన్న మిషన్ భగీరథ కార్యక్రమం దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందని…కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ కార్యక్రమానికి మిషన్ భగీరథ ఆదర్శంగా నిలిచిందన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి రూ.25,105 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇస్తారని కేంద్ర ప్రభుత్వంపై ప్రజలు భారీ అంచనా పెట్టుకున్నారు….జల్ జీవన్ మిషన్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ముందే మిషన్ భగీరథగా పూర్తి చేసినందుకు గాను మూడేండ్లకు కలిపి రూ.1350 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు.14వ అర్థిక సంఘం నిధులు స్థానిక సంస్థలకు రూ.1,114 కోట్ల నిధులు పెండింగ్ లో ఉన్నాయి….ఏపీ విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులలో భాగంగా రూ. 817.61 కోట్ల నిధుల బకాయిలు విడుదల చేయాలన్నారు. కరోనా సంక్షోభం నుంచి భారత అర్థిక వ్యవస్థ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా అన్నారు.