- Advertisement -
కొండ పోచమ్మ కెనాల్ నుండి కొడకండ్ల రీమ్మన గూడ వద్ద కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు విడుదల చేశారు. కూడవెల్లి వాగులోకి గోదావరి జలాల విడుదలతో గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గ రైతుల సాగునీటి కష్టాలు తీరనున్నాయి. జలాల విడుదలతో గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గంలో 11 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. కూడవెల్లి వాగులోకి గోదావరి జలాల విడుదల పట్ల గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గ రైతుల హర్షం వ్యక్తం చేశారు.
సాగునీరు విడుదల చేయడంపై సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు నియోజకవర్గ రైతులు కృతజ్ఞతలు తెలిపారు. కూడవెల్లి వాగుపై గజ్వేల్, తొగుట, దుబ్బాక మండలాల్లో 36 చెక్‌డ్యామ్‌లు జలకళను సంతరించుకోనున్నాయి. అంతకు ముందు మంత్రి హరీష్ రావుకు రిమ్మనగూడ వద్ద మంగళహారతులు, డప్పుచప్పుళ్లతో రైతులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు.
- Advertisement -