డబ్బులు పంచుతూ అడ్డంగా బుక్కైన ఎన్డీఏ కూటమి!

267
aiadmk
- Advertisement -

తమిళనాడు ఎన్నికల మహాసంగ్రామం జోరందుకుంది. ప్రచారంలో అధికార అన్నాడీఎంకే,ప్రతిపక్ష డీఎంకే మధ్య మాటల యుద్దం తారస్ధాయికి చేరుకుంది. ఇక ఈ నేపథ్యంలో ఓటర్లను మభ్యపెట్టేందుకు క్యాష్ రాజకీయాలకు తెరలేపింది ఎన్డీఏ కూటమి.

ఇందుకు సంబంధించి అన్నాడీఎంకే నేత ఒక‌రు ఓట‌ర్లకు డ‌బ్బులు పంచుతున్న వీడియో బ‌య‌ట‌ప‌డింది. చెపాక్ నియోజ‌క‌వ‌ర్గంలో ఓట‌ర్ల‌కు రూ.500 నోట్లు పంచుతూ క‌నిపించారు. ఐడీ కార్డుల‌ను ప‌రిశీలించి, ఆ త‌ర్వాత అన్నాడీఎంకే నేత ఓట‌ర్ల‌కు డ‌బ్బులు పంచుతున్న‌ట్లు గుర్తించారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి డీఎంకే పార్టీ ఉద‌య‌నిధి స్టాలిన్‌ను పోటీలో ఉన్నారు.

దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసింది డీఎంకే. 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న త‌మిళ‌నాడులో ఏప్రిల్ ఆర‌వ తేదీన ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.ఇక ఈసారి ఎన్నికల్లో తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు కమల్ హాసన్‌. 154 స్థానాల్లో మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అభ్యర్థులు బరిలో ఉండగా మిగితా స్ధానాలను మిత్రపక్షాలకు కేటాయించారు కమల్.

- Advertisement -