తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందని తెలిపారు సీఎం కేసీఆర్. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడిన సీఎం…అడ్వకేట్ దంపతుల హత్య కేసుతో టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
నిందితులు ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్నారని … ఈ హత్య కేసులో ఎవరున్నా సరే వదిలిపెట్టం… ఇప్పటికే ఆరుగురు కుంట శ్రీనివాస్, చిరంజీవి, అక్కప్ప కుమార్, శ్రీనివాస్, బడారి లచ్చయ్య, వెల్ది వసంతరావును పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. హత్య కేసులో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఉన్నాడు. ఆ విషయం తెలిసిన మరుక్షణమే పార్టీ నుంచి తొలగించాం. అతన్ని అరెస్టు కూడా చేశారు. వారు కూడా జైల్లో ఉన్నారని తెలిపారు.
ఈ కేసు విషయంలో కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదన్నారు. ఈ కేసు విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల సందర్భంలో కూడా పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయలేదని….. గత శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు డీజీపీకి కూడా ఫోన్ చేయలేదు. ప్రజాక్షేత్రంలో నిబద్దతగా ఉంటున్నాం అన్నారు.