- Advertisement -
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి స్వల్పంగా పెరిగిపోతున్నాయి. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా మరోవైపు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. స్కూళ్లు తిరిగి ప్రారంభమైన తర్వాత కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి.
అయితే తాజాగా హైదరాబాద్ నాగోల్ బండ్లగూడలోని మైనార్టీ వెల్ఫేర్ హాస్టల్‌లో ఒకే సారి భారీ సంఖ్యలో కోవిడ్ కేసులు వెలుగు చూడడం సంచలనంగా మారింది. మైనార్టీ వెల్ఫేర్ హాస్టల్‌లో ఇప్పటి వరకు ఏకంగా 38 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు…..విద్యార్థులు, స్టాఫ్‌కు కూడా టెస్టులు చేసే పనిలో పడిపోయారు.
- Advertisement -

