- Advertisement -
రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలిని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు.ఈరోజు సభలో కేవలం సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. నాగార్జున సాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యతో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేల మృతికి సభ సంతాపం తెలుపనుంది.
అనంతరం సభ వాయిదా పడనుంది. ఈ నెల 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు తీర్మానంపై చర్చ జరగనుంది. వార్షిక బడ్జెట్ను ఈ నెల 18న ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నారు. కరోనా నేపథ్యంలో అన్ని ప్రోటోకాల్ చర్యలను తప్పనిసరి చేశారు.
- Advertisement -