- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు ఈరోజు తన జన్మదినం సందర్భంగా రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నా జన్మదినం సందర్భంగా బాధ్యతగా ఈ రోజు ఒక మొక్కను నాటడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. ఈ పుట్టినరోజు రోజు ఎప్పటికీ మర్చిపోలేను అని అన్నారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తు పచ్చదనం పెంచడం కోసం కృషి చేస్తున్న ఎంపీ సంతోష్‌కు ధన్యవాదాలు.. ఈరోజు మొక్కలు నాటడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. ఇది ఎప్పటికీ మరిచిపొలేని మధుర జ్ఞాపకం గా ఉంటుంది అని ఈ సందర్భంగా సంతోష్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు.
- Advertisement -