- Advertisement -
ఎమ్మెల్సీ మరియు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన సందర్భంగా ప్రముఖ పర్యావరణ సంస్థ గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బిగ్ బాస్ ఫెమ్ అఖిల్ సార్ధక్ గులాబీ మొక్కను నాటాడు. ఈ సందర్భంగా అఖిల్ సార్ధక్ మాట్లాడుతూ.. ప్రతి శుభ కార్యక్రమంలో మొక్కలు నాటే ఆనవాయితీ ఎంపీ సంతోష్ కుమార్ చొరవ అని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టి ప్రజల్లో మంచి చైతన్యం కల్పిస్తున్నారని అన్నారు.
రాజ్యసభ సభ్యులు ఎంపీ జే. సంతోష్ కుమార్ యువతకు స్ఫూర్తిదాయకం అని అఖిల్ సార్ధక్ అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు బైరి శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు జైని రాజేశ్వర్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -