హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్స్‌లో టీ న్యూస్ గోల్డెన్ ప్రాపర్టీ షోను ప్రారంభించారు మంత్రి హరీశ్ రావు. జ్యోతి ప్రజ్వాళన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు హరీశ్ రావు. రెండు రోజుల పాటు జరిగే ప్రాపర్టీ షోకి ప్రవేశం ఉచితం. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్…పెట్టుబడులకు హైదరాబాద్ అనువైన ప్రదేశం అన్నారు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చని తెలిపారు హరీశ్. ప్రస్తుతం ప్రజలు..ఇంటి స్థలం లేదా ఇల్లు కొనడంపై ఆసక్తి కనబరుస్తున్నారని అలాంటి వారికి ఈ ప్రాపర్టీ షో ద్వారా మంచి అవగాహన పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో టీ న్యూస్ సీజీఎం ఉపేందర్,సురేష్,పీవీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నగరాల్లో రోజు రోజుకి పెరిగిపోతున్న మధ్యతరగతి జనాభా వల్ల రియల్ ఎస్టేట్ రంగం మరింతగా పుంజుకుంటుంది. అయితే,పెరుగుతున్న పోటీకి అనుగుణంగా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ కంపెనీలు వెలుస్తున్నాయి. కొన్ని కంపెనీలు కస్టమర్లకు లాభాల పంటను పండిస్తుంటే మరికొన్ని నట్టేట ముంచేస్తున్నాయి.
ఈ క్రమంలో ఏయే ప్రాంతాల్లో కొత్తగా ఫ్లాట్ల నిర్మాణం ప్రారంభమైంది? ఎక్కడ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు అమ్ముడవుతాయి? ట్రిపుల్ బెడ్‌రూం ఫ్లాట్లకు గిరాకీ ఉన్న ప్రాంతాలేవి? ఒక ఏడాదిలో అధిక స్టాకు (ఇండ్లు) అందుబాటులోకి వచ్చిన ప్రాంతమేది? ఇండ్ల సరఫరా తక్కువగా ఉండి.. డిమాండ్ అధికంగా ఉన్న ఏరియాలేవి?ఏ కంపెనీ చేపట్టిన వెంచర్లో ఫ్లాట్ కొనాలి..?అన్న సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఈ ప్రాపర్టీ షో ఉపయోగపడనుంది.