ఓట‌రు కార్డుకు ప్ర‌త్యామ్నాయంగా మ‌రో 9 కార్డులు..

143
MLC polls
- Advertisement -

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటింగ్ మార్చి 14 నాడు జరుగుతుంది.అయితే పోలింగ్‌ రోజు ఓటర్ స్లిప్ తోపాటు 9 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక ఐడి కార్డు తీసుకొని వెళ్ళాలి. ఈవీఎం లు కాకుండా ఈ ఎన్నికలు కేవలం బ్యాలెట్ పేపర్‌తో నిర్వహిస్తున్నారు. పోలింగ్ అధికారే ఓటరుకు బ్యాలెట్ పేపర్‌తో పాటు ఓటు వేయడానికి పెన్ను వారే ఇస్తారు. వారు ఇచ్చే పెన్నుతో మాత్రమే ఓటు వేయాలి. బ్యాలెట్ పేపర్ లో పోటీ చేసే అభ్యర్థుల పేరు,పార్టీ పేరు, లేదా స్వతంత్ర అనేది పక్కన బాక్స్ ఉంటాయి.

ఈ ఎన్నికల్లో మొత్తం 93 మంది అభ్యర్థుల పేర్లు బ్యాలెట్ పేపర్‌లో ఉంటాయి. పోలింగ్ అధికారి మనకు ఇచ్చిన పెన్నుతో 1,2,3,4,…ఇలా ప్రాధాన్యత క్రమంలో కేటాయించాలి. మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రం తప్పక వేయాలి. ఒక్కరికీ ఓటు వేయవచ్చు లేదా కొంతమందికి లేదా అందరికి వేయవచ్చు. అది ఓటరు ఇష్టం. కానీ ప్రాధాన్యత తప్పవద్దు.

ప్రాధాన్యత ఎలాగో చూద్దాం..

మొత్తం 93 మంది ఉన్నారు. ఓటరు ఒక ఆరుగురికి వేద్దాం అనుకుంటే బ్యాలెట్ పేపర్ పరిశీలించి. అందులో ఒకరికి 1, ఇక అనుకున్న వారికి 2,3,4,5,6 అను నెంబర్లు వారి ఎదురుగా గల బాక్స్ లో రాయాలి.. ఒకవేళ 10కి అనుకుంటే నేను అనుకున్న వారికి 1,2,….10 వేయొచ్చు.లేదా అందరికి అనుకుంటే 1,2,…..93 వరకు వేయొచ్చు.బ్యాలెట్ పేపర్ పై కేవలం 1,2,3, అను అంకెలు మాత్రమే రాయాలి. రోమన్ అంకెలు I II III అని రాయకూడదు. ఒకటి, రెండు….అని తెలుగులో రాయవద్దు. ఇలా ✔️టిక్ చేయవద్దు. one, two అని రాయవద్దు. పోలింగ్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది.

గుర్తింపు కార్డులు ఇవే…

మార్చి 14న జరిగే పోలింగ్‌కు ఓట‌రుగుర్తింపుకార్డులేకున్నా ఈ క్రిందిగుర్తింపుడాక్యుమెంట్ల‌ను చూపించి ఓటు వేసే అవ‌కాశం ఉంటుంది. ఓటు వేయ‌డానికి ముందు పోలింగ్ కేంద్రంలో వారి గుర్తింపు నిర్థార‌ణ‌కు , ఓట‌రు గుర్తింపుకార్డుల‌యినా చూపాలి లేదా అవి లేనివారు వారి గుర్తింపు నిర్థార‌ణ‌కు కింద తెలిపిన ప్ర‌త్యామ్నాయ ఫోటో గుర్తింపు కార్డుల‌లో ఏద‌యినా ఒక‌ దానిని చూపాలని జిల్లా ఎన్నిక‌ల అధికారి స్ప‌ష్టం చేశారు.

  1. ఆధార్ కార్డు, 2. పాస్‌పోర్ట్‌, 3. డ్రైవింగ్ లైసెన్స్‌, 4. ఫోటోతో కూడిన‌ స‌ర్వీస్ ఐడెంటిటి కార్డ్‌, 5. పాన్ కార్డు, 6. ఎం.ఎల్‌.ఏ, ఎం.పి, ఎమ్మెల్సీల‌కు జారీచేసిన అధికార గుర్తింపు ప‌త్రం, 7. ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లకు సంబంధిత విద్యా సంస్థలు జారీచేసిన గుర్తింపు కార్డు, 8. యూనివర్సిటీలు జారీచేసిన డిగ్రీ/ డిప్లామా ఒరిజనల్ సర్టిఫికేట్లు, 9 దివ్యాంగులకు జారీచేసిన అధికారిక గుర్తింపు కార్డు.

-పోలింగ్ రోజు ప్రచారంపై నిషేదం.
-ఓట్లు వేయాలనే ప్రచారం నిర్వహించరాదు.
-ప్రత్యేక అభ్యర్థికి ఓటు వేయాలని కోరరాదు.

- Advertisement -