వివోకే ఐపీఎల్ స్పాన్సర్‌ షిప్!

374
vivo
- Advertisement -

ఐపీఎల్ 14వ సీజన్ టైటిల్ స్పాన్సర్‌ షిప్‌ను దక్కించుకుంది వివో. బీసీసీఐతో కుదిరిన ఒప్పందం ప్రకారం 2023 వరకు వివో…… లీగ్‌ ప్రధాన స్పాన్సర్‌గా కొనసాగనుంది. 2018లో బోర్డుతో ఐదేండ్ల ఒప్పందానికి వివో 2,190 కోట్లు చెల్లించేందుకు ముందుకు వచ్చింది. దీని ప్రకారం ప్రతి ఏడాది స్పాన్సర్‌షిప్‌ హక్కుల కింద బోర్డుకు 440 కోట్లు చెల్లించింది.

అయితే గతేడాది దేశవ్యాప్తంగా చైనా కంపెనీల ఉత్పత్తులపై నిషేధం విధించాలన్న డిమాండ్‌ నేపథ్యంలో వివో తప్పుకోగా ‘డ్రీమ్‌ ఎలెవన్‌’ స్పాన్సర్‌గా వ్యవహరించింది. అయితే ప్రస్తుతం మారిన పరిస్థితుల నేపథ్యంలో వివోతో ఒప్పందం కొనసాగించేందుకు బీసీసీఐ సిద్ధమైంది.

- Advertisement -