రివ్యూ : గాలి సంపత్

1051
gali sampth
- Advertisement -

బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘గాలి సంప‌త్. ఎస్. క్రిష్ణ నిర్మాత‌గా ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్ తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ విష్ణు సరసన ల‌వ్‌లీ సింగ్ హీరోయిన్‌గా న‌ట‌కిరీటి డా. రాజేంద్ర ‌ప్ర‌సాద్గాలి సంప‌త్‌`గా టైటిల్ రోల్ పోషిస్తున్నఈ మూవీకి అనీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంతో శ్రీవిష్ణు మెప్పించాడా లేదా చూద్దాం..

కథ :

సంపత్ (రాజేంద్ర ప్రసాద్‌)కు నటన అంటే పిచ్చి. నాటకానుభవంతో సినిమాల్లోకి వెళ్ళాలనుకుంటాడు. కానీ అతని జీవితంలో జరిగిన ఓ విషాద సంఘటన కారణంగా మాట కోల్పోతాడు. అయితే మూకాభినయంతో ప్రావీణ్యం సంపాదించగా అతని కొడుకు సూరి (శ్రీ విష్ణు) కి తండ్రి అంటే క్షణం పడదు. అసలు తండ్రీ కొడుకుల మధ్య ఎందుకు గ్యాప్ ఏర్పడింది..? చివరకు తన తండ్రి కారణంగా సూరి ప్రేమ కథ ఎలా సుఖాంతం అయింది..?అన్నదే గాలి సంపత్ కథ.

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ రాజేంద్ర ప్రసాద్‌ నటన, మాటలు, నేపథ్య సంగీతం. తండ్రిని అపార్థం చేసుకునే కొడుకుగా, ఆ తర్వాత ఆరాధించే వ్యక్తిగా శ్రీవిష్ణు చక్కగా నటించాడు. హీరోయిన్ లవ్‌లీ సింగ్ అందంతో ఆకట్టుకుంది. ఇక సినిమాకు ప్లస్ పాయింట్‌ అయిన రాజేంద్రప్రసాద్ …సంపత్ పాత్రలో ఒదిగిపోయాడు. ఆయన్ని మరో స్థాయిలో నిలబెట్టింది. మాటలు రాకపోయినా గాలితో శబ్దం చేస్తూ,తన మదిలోని భావాన్ని వ్యక్తం చేసే ఓ తండ్రిగా చక్కగా నటించారు. సంపత్‌ గ్యాంగ్ లో సత్య, సురేంద్రరెడ్డి నవ్వించే ప్రయత్నం చేశారు.

మైనస్ పాయింట్స్:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ బలహీనమైన కథ, కథనాలు. దర్శకుడు అనీశ్‌ కృష్ణ కొన్ని పాత్రల నుండి నటనను రాబట్టే క్రమంలో వారికి ఎక్కువ ఫ్రీడమ్‌ ఇచ్చేశారేమో అనిపిస్తోంది. బ్యాంక్ మేనేజర్‌గా నటించిన శ్రీకాంత్‌ అయ్యంగార్, బ్యాంక్ ఆడిటింగ్ కు వచ్చిన అనీశ్ కురువిల్లా మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా బాగుంది. అందమైన అరకు నేపథ్యంలో సాగే ఈ కథను అంతే అందంగా సాయిశ్రీరామ్ తన కెమెరాలో బంధించారు. ఇలాంటి సినిమాలకు సంగీతమే బ్యాక్ బోన్ గా నిలుస్తుంది. ఆ శాఖను అచ్చు రాజమణి సమర్థవంతంగా నిర్వహించారు. నేపథ్య సంగీతం,ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:

తండ్రీ కొడుకుల నేపథ్యంలో తెలుగులో బోలెడన్నీ సినిమాలు వచ్చాయి. కానీ వాటికి పూర్తి భిన్నమైన సినిమా ‘గాలి సంపత్‌’. భార్య దూరమైనా ఒక్కగానొక్క కొడుకు కోసం బ్రతికే తండ్రి కథ ఇది. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో పర్వాలేదనిపించే మూవీ గాలి సంపత్.

విడుదల తేదీ: 11/03/2021
రేటింగ్: 2.5 / 5
నటీనటులు: శ్రీవిష్ణు,రాజేంద్ర ప్రసాద్,లవ్‌లీ సింగ్
సంగీతం:అచ్చు రాజమణి
నిర్మాత:ఎస్‌ కృష్ణ
దర్శకత్వం:అనీష్

- Advertisement -