- Advertisement -
ఈరోజు జరిగిన పార్లమెంట్ సమావేశాలలో ఎంపీ రంజిత్ రెడ్డి ప్రశ్నకు లోక్ సభలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జనవరి 1, 2020 వరకు తెలంగాణ రాష్ట్రంలో 139 మంది ఐపీఎస్ అధికారులు ఉన్నారని తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం 34 ఖాళీలు ఉన్నాయి. పదవీ విరమణ, రాజీనామా, మరణం, సర్వీస్ నుంచి తొలగించడం, పలు ఇతర కారణాలతో ఈ పోస్టుల ఖాళీలు ఏర్పడ్డాయి. దేశవ్యాప్తంగా ఖాళీల భర్తీకి ఐపీఎస్ బ్యాచ్ పరిమితిని క్రమంగా పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. 2019 సివిల్ సర్వీస్ పరీక్ష ద్వారా తెలంగాణకు ఐదుగురు ఐపీఎస్ లను కేటాయించినట్లు కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.
- Advertisement -