సుదీర్ఘ కాలం తర్వాత వెండితెరపై ఖైదీ నెంబర్ 150 ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన చిరు. ఏమాత్రం చెక్కు చెదరకుండా అదే స్టైల్‌లో నటించాడు. అమ్మడూ.. లెట్స్ డు కుమ్ముడుతో టాలీవుడ్ రికార్డులను మెగాస్టార్ బ్రేక్ చేశాడు. డ్యాన్సు,యాక్షన్స్‌లతో అదరగొట్టాడు. సినిమా హిట్ టాక్‌తో చిరు అభిమానుల ఆనందానికి ఆవధులు లేకుండా పోయింది. తొమ్మిదేళ్ల విరామం తర్వాత మెగాస్టార్ నటించిన సినిమా టీజర్ దగ్గరి నుంచి సాంగ్స్ వరకు భారీగానే రికార్డులను బద్దలు కొట్టింది.ఈ సినిమాతో చిరు మళ్ళీ ఫాంలోకి వచ్చాడంటూ చిరు ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అయితే చిరంజీవి ఖైదీనెంబర్ 150కి తీసుకున్న రెమ్యునరేషన్ గురించి తెలిస్తే షాక్‌కు గురికావల్సిందే. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన ఈసినిమాకి చిరు దాదాపు రూ.33కోట్లు తీసుకొన్నాడని ఫిల్మ్‌నగర్‌లో గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఖైదీ సినిమాని దాదాపు రూ.55 కోట్లతో నిర్మాత రాంచరణ్ తెరకెక్కించాడు. ఈ చిత్రం సుమారు రూ.150 కోట్లకుపైగా గ్రాస్‌ను రాబట్టింది.
అయితే మనకు ఒక సందేహం రావచ్చు చిరు తనయుడు రాంచరణే ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు కదా ….చిరు పారితోషికం తీసుకున్నాడా అనే సందేహం కలుగుతుంది. కానీ తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం రాంచరణ్ చిరుకు వచ్చిన లాభాల్లో కొంత పర్సెంటేజ్ ఇచ్చిడని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చిన లాభాల్లో మెగాస్టార్ రూ.33 కోట్లు తీసుకోగా, చరణ్‌కు రూ.22 కోట్లు మిగిలాయట. అంతేకాదు.. ప్రస్తుతం హీరోల్లో ఎవరు అత్యధిక పారితోషికం తీసుకుంటున్నారంటే.. చిరంజీవేనని ఫిల్మ్‌నగర్ చర్చించు కుంటున్నారు. చిరంజీవి తొమ్మిది సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న రెమ్యునరేషన్ మాత్రం భారీగా తీసుకున్నడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.