పీవీ నరసింహారావు సేవలు దేశానికి, రాష్ట్రానికి చేసింది ప్రజలు మర్చిపోలేదని ఎంపీ కె కేశవ రావు అన్నారు. ఈరోజు కేకే తెలంగాణ భావన్‌లో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, మూడు జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నగర మేయర్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ.. పీవీ గుణాలు తన కూతురు వానిలో ఉన్నాయి. విద్యారంగంలో అనేక సేవలు వానిదేవి చేస్తున్నారు. ఎలాంటి కాంట్రవర్సీ లేని వ్యక్తి వానిదేవి అని ప్రశంసించారు. టీఆర్‌ఎస్ బలాలతోనే ఎమ్మెల్సీ ప్రచారంలోకి వెళ్తున్నాము. ప్రతిపక్షాల లాగా అనవసర విమర్శలు మేము చేయము. ఆరు సంవత్సరాలలో 1లక్ష 32వేల ఉద్యోగాలు సొంత రాష్ట్రం తెలంగాణలో ఇచ్చాము. విద్యా రంగంలో కేంద్రం దేశ ప్రజలకు, తెలంగాణకు చేసింది ఏమీ లేదని కేకే పేర్కొన్నారు.