సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార, తమిళ యంగ్ హీరో శింబు సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకున్నారా? అంటే కోలీవుడ్ వర్గాల్లో అవుననే టాక్ వినిపిస్తోంది. తాజాగా వీళ్లద్దరూ గుడిలో మూడు ముళ్ల బంధంతో ఏకమయ్యారట.
అయితే ఇదంతా నిజం అనుకుంటే పొరపాటే. వల్లభ మూవీ తరువాత ఇద్దరు కలిసి సరసుడు పేరుతో వస్తున్న ఓ మూవీలో నటిస్తున్నారు. శింబు ఓన్ ప్రొడక్షన్ వస్తున్న ఈ చిత్రం ఐటీ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఓ ప్రేమ కథ అని తెలుస్తోంది. ఇందులో నయనతార, శింబు పెళ్లి చేసుకునే సీన్ ఒకటి ఉంది. ఆ సీన్ లోని స్టిల్ కాస్తా లీక్ అవ్వడంతో ఇప్పుడు ఇది నిజం పెళ్లిగా వైరల్ అవుతోంది.
మొదట ప్రభుదేవా, ఆతరువాత శింబుతో ప్రేమాయణం సాగించిన నయనతార వారితో బ్రేకప్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సంతోష్ శివన్ తో ఈ భామ రిలేషన్‌షిప్ మెయింటెన్ చేస్తోంది. ఇక శింబుతో ఒకప్పుడు నయనతార సాగించిన ప్రేమాయణం నేపధ్యంలో సరసుడు సినిమాకి మాంచి హైప్ లభిస్తుందనడంలో ఎలాంటి సందేహంలేదు.