గాల్వాన్ మృతుల వివరాలను వెల్లడించిన చైనా..!

188
china
- Advertisement -

భారత్ – చైనా మధ్య గాల్వాన్ వద్ద గతేడాది జూన్‌లో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. అయితే భారత్ చనిపోయిన జవాన్ల వివరాలను వెల్లడించినా చైనా మాత్రం ఇప్పటివరకు దాటవేస్తూ వచ్చింది.

అయితే ఈ ఘర్షణలో 40 మంది చైనా సైనికులు చనిపోయారని రష్యా వెల్లడించగా తాజాగా చైనా స్పందించింది. తూర్పు లదాఖ్‌ ఘర్షణలో ఐదుగురు మిలిటరీ ఆఫీసర్లు, సైనికులు అమరులైనట్లు తెలిపింది. షిన్‌జియాంగ్‌ మిలిటరీ కమాండర్‌ కీ ఫబావోతో పాటు, చెన్‌ హోంగ్జన్‌, చెన్‌ షియాన్‌గ్రాంగ్‌, షియాలో సియువాన్‌, వాంగ్‌ జురాన్‌ మృతిచెందినట్లు పేర్కొంది. వీరికి గౌరవ హోదాలు కల్పించినట్లు తెలిపింది.

చైనా ఆర్మీ దురాగతానికి కల్నల్‌ సంతోష్‌ బాబు సహా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు.

- Advertisement -