- Advertisement -
మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు మంత్రి కేటీఆర్. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ మృతిపట్ల సంతాపం తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం మహబూబ్‌నగర్ పట్టణం శ్రీనివాస కాలనీలో ఉన్న మంత్రి ఇంటికి చేరుకున్న కేటీఆర్..నారాయణ గౌడ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. నారాయణ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు ఉన్నారు.
- Advertisement -