కాంగ్రెస్‌లో ఆ గుంటనక్క ఎవరు…?

131
dasoju sravan
- Advertisement -

ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ సీనియర్ నేత,జాతీయ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరుస ట్వీట్లలో సొంతపార్టీ నాయకుడిపై విమర్శలు గుప్పించారు. కృతజ్ఞత లేని నాయకుడు, గుంటనక్క కన్నా హీనమంటూ పేల్కొన్న శ్రవన్‌… గుంటనక్కతో నైనా సహవాసం చేయవచ్చు, కానీ కృతజ్ఞత లేని నాయకుడితో సాంగత్యం మాత్రం కోరుకోవద్దంటూ పేర్కొన్నారు. దీంతో శ్రవణ్‌ ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారోనని పార్టీ నేతల్లో తీవ్ర చర్చనడుస్తోంది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో దాసోజు శ్రవణ్ ఖైరతాబాద్ నుంచి పోటీ చేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరి రాహుల్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా ఎదిగారు.

- Advertisement -