దగ్గుబాటి రానా, తాప్సీ హీరో హీరోయిన్‌లుగా కొత్త దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ‘ఘాజీ’ సినిమా తెరకెక్కుతుంది. 1971 భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగక ముందు విశాఖలో దొరికిన సబ్ మెరైన్ ‘ఘాజీ’పై ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో రానా నేవీ ఆఫీసర్‌గా కనిపించగా, తాప్సీ, నాజర్, ఓంపురి, కేకే మీనన్ తదితరులు వివిధ పాత్రలలో నటించారు.
అయితే ఈట్రైలర్‌కి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ చెప్పారు. భారత్ పాకిస్తాన్ ఇప్పటి వరకు నాలుగు యుద్దల్లో తలపడ్డాయి…. కానీ అందరికీ తెలియని మరో పొరాటం విశాఖపట్నం తీర సమీపంలో జరిగింది. అంటూ చిరు తనదైన స్టైల్‌లో ఈమూవి ట్రైలర్‌కు వాయిస్ ఇచ్చారు. ఆ తర్వాత మిగతా పాత ట్రైలర్‌నే దానికట్టి జత కట్టేశారు. ఈసినిమా హిందీ ట్రైలర్‌కి అమితాబచ్చన్…తమిళ్ ట్రైలర్‌కి హీరో సూర్య వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఫిబ్రవరి 17న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘ఘాజీ’ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.
ప్రతి క్షణం ఉత్కంఠను రేకెత్తించేలా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఈ సినిమాను పీవీపీ సినిమా పతాకంపై పరమ్ వి.పొట్లూరి నిర్మించారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని “క్లీన్ యు” సర్టిఫికెట్ అందుకొంది.