టీఆర్ఎస్….వీరుల పార్టీ: సీఎం కేసీఆర్

193
telangana cm
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీ అంటే వీరుల పార్టీ…. వీపు చూపించే పార్టీ కాదన్నారు సీఎం కేసీఆర్. నల్గొండ జిల్లా హాలియాలో జరిగిన బహిరంగసభలో మాట్లాడిన సీఎం …నల్లగొండ జిల్లాలో 844 గ్రామపంచాయతీలున్నాయని ఒక్కో గ్రామపంచాయతీకి రూ. 20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. మండల కేంద్రానికి అభివృద్ధి కోసం రూ. 30 లక్షలు, 8 మున్సిపాలిటీలున్నాయని నల్గొండ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.10 కోట్లు, మిర్యాలగూడ మున్సిపాలిటీకి రూ.5 కోట్లు, మిగితా మున్సిపాలిటీలకు ఒక్కో కోటి చొప్పున విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇవన్నీ కలిపితే రూ.186 కోట్లు అవుతాయని రేపే జీవో విడుదల చేస్తామని వెల్లడించారు. ఎదురుఎండ ఉన్న తన మాటలు వినడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు.

నెల్లికల్‌,చింతపాలెం ఐదారు గ్రామాల సమస్య తొలగిపోతాయని తెలిపారు. నల్గొండ జిల్లా అనాధిగా నష్టానికి గురైన జిల్లా అన్నారు. అర్హులందరికీ కొత్త ఫించన్లు మంజూరు చేస్తామని తెలిపారు. నెల్లికల్‌లో ఇవాళ ప్రారంభించిన ఎత్తిపోథల పథకాలను సంవత్సరంన్నర లోపే పూర్తి చేస్తామన్నారు.
ఇవాళ ప్రారంభించిన ఎత్తిపోథల పథకాలను పూర్తి చేసి నీరందించకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని చెప్పారు సీఎం కేసీఆర్. ఇందుకు నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధలు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. నీళ్లొస్తే ప్రజలు సంతోషిస్తారని చెప్పారు సీఎం కేసీఆర్.

పాలేరు రిజర్వాయర్ నుండి నల్గొండ ఆయకట్టుకు నీరందిస్తామని చెప్పారు సీఎం. శాశ్వతంగా నల్గొండ జిల్లాకు నీటి సమస్య తొలగిపోతుందన్నారు. నల్లగొండ కలకలలాడుతుండాలని నీళ్లు తెచ్చి నల్లగొండ ప్రజల కాళ్లు కడుగుతామని చెప్పారు. పోడు భూముల సమస్యలను త్వరలోనే పరిష్కారం చేస్తామని చెప్పారు.

- Advertisement -