- Advertisement -
తెలంగాణలో జరిగే పదో తరగతి పరీక్ష షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం విడుదల చేసింది. ఈ ఏడాది విద్యార్థులకు ఆరు పరీక్షలే ఉంటాయని స్పష్టం చేసింది. మే 17 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్ష సమయం కేటాయించింది.
పరీక్ష షెడ్యూల్ ఇలా..
1.మే 17న ప్రథమ భాష (తెలుగు)
2.18న ద్వితీయ భాష (హిందీ)
3.మే 19న ఇంగ్లిష్ పేపర్
4.మే 20న మ్యాథ్స్ (గణితం)
5.మే 21న సామాన్యశాస్తం
6.మే 22న సాంఘికశాస్త్రం పరీక్షలుంటాయి.
- Advertisement -