మోడల్ స్కూల్ తనిఖీ చేసిన మంత్రి సబితా….

138
sabitha indrareddy
- Advertisement -

నేదునూరు మోడల్ స్కూల్‌ని తనిఖీ చేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. పల్లెనిద్రలో భాగంగా కందుకూరు మండలం లోని నేదునూరు గ్రామంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సబితా…నేదునూరు గ్రామంలో గల మోడల్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

స్కూల్లో ఉన్న వస్తువులను మరియు టాయిలెట్లను మంచినీటి వ్యవస్థను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లోనవ్వకుండా ఇంకా కావలసిన సదుపాయాలు గురించి కూడా తక్షణమే అందజేస్తామని హామీ ఇచ్చారు. పాఠశాల ఆవరణంలో 20 లక్షల రూపాయలతో గ్రంథాలయం నిర్మించి పుస్తకాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -