- Advertisement -
కశ్మీర్ అంశంపై న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానంపై ఆగ్రహం వ్యక్తం చేసింది భారత్. ఫిబ్రవరి 5ను ‘కశ్మీర్ అమెరికన్ డే’గా ప్రకటించాలంటూ తీర్మానం చేసింది. న్యూయార్క్ అసెంబ్లీ సభ్యుడు నాదర్ సయేగ్ మరో 12 మందితో కలిసి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిని భారత్ తప్పుబట్టింది.
కశ్మీర్ అంశం తమ అంతర్గత వ్యవహారమని, ఇందులో ఇతరుల జోక్యాన్ని సహించబోమని తేల్చి చెప్పింది. అమెరికా మాదిరిగా భారత్ కూడా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, భిన్నమైన సంస్కృతికి నిదర్శనం.. అందులో జమ్మూ-కశ్మీర్ ఓ భాగమే.. ఇది 135 కోట్ల మంది భారతీయులకు ఎంతో గర్వకారణం అంటూ వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం ప్రతినిధి వ్యాఖ్యానించారు. న్యూయార్క్ అసెంబ్లీ సభ్యులను కలిసి భారత్-అమెరికా సత్సంబంధాలపై చర్చిస్తామన్నారు.
- Advertisement -