ఏపీ మంత్రి పెద్దిరెడ్డికి షాకిచ్చిన నిమ్మగడ్డ..

125
peddi reddi
- Advertisement -

ఏపీ స్ధానిక సంస్ధల ఎన్నికల వేళ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. స్ధానిక సంస్థల ఎన్నికలు సజావుగా సాగేందుకు పెద్దిరెడ్డిని ఈ నెల 21వ తేదీ వరకు ఇంటికే పరిమితం చేయాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ని ఆదేశించింది.అలాగే మీడియాతో మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని తేల్చి చెప్పింది. ప్రజలు నిర్భయంగా ఓటేసేందుకే ఈ చర్యలు తీసుకుంటుంన్నామని ఎస్‌ఈసీ పేర్కొంది.

పంచాయతీరాజ్ శాఖా మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి…నిమ్మగడ్డపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. అలాగే తనను ఇంటికే పరిమితం కావాలన్న నిమ్మగడ్డ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు పెద్దిరెడ్డి. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ మాటలు విని ఏకపక్షంగా వ్యవహరించే అధికారులను.. మా ప్రభుత్వం ఉన్నన్ని రోజులూ బ్లాక్‌ లిస్ట్‌లో పెడతాం అన్నారు. ఏకగ్రీవమైన అభ్యర్థులకు డిక్లరేషన్‌ ఇవ్వని అధికారుల పేర్లు తీసుకుని.. మార్చి 31 తర్వాత గుణపాఠం నేర్పుతాం అని హెచ్చరించారు.

- Advertisement -