- Advertisement -
కాంగ్రెస్ నేతలపై దాడి కేసులో ఎంఐఎం నేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి ఊరట లభించింది. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, షబ్బీర్ అలీపై దాడికి సంబంధించిన మీర్‌చౌక్ కేసులో హైకోర్టు శుక్రవారం స్టే విధించింది.
ప్రస్తుతం మీర్‌చౌక్ కేసుపై ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగుతుండగా ఈ కేసుపై స్టే విధించాలని కోరుతూ ఎంపీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి ధర్మాసనం దిగువ కోర్టు విచారణపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీచేసింది.
- Advertisement -