10న నెల్లికల్లు ఎత్తిపోతలకు శంకుస్థాపన- సీఎం కేసీఆర్‌

175
- Advertisement -

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, నాగార్జున సాగర్, మునుగోడు, కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల పరిధిలోని నెల్లికల్లుతో పాటు ఇతర ఎత్తిపోతల పథకాలను త్వరితగతిన నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఇవాళ ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి శ్రీ జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు, ఇతర ముఖ్య ప్రజా ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నల్లగొండ జిల్లాలో సాగునీటి వ్యవస్థపై చర్చ జరిగింది. వివిధ ప్రాజెక్టుల కింద కవర్ కాగా, మిగిలిన ఆయకట్టుకు సాగు నీరు అందించడానికి అనువుగా రూ.3 వేల కోట్లతో నెల్లికల్లుతో పాటు 8-9 ఎత్తిపోతల పథకాలను నిర్మించనున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ ఎత్తిపోతల పథకాలన్నింటికి ఒకే చోట శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. ఈ నెల 10న మద్యాహ్నం 12.30 గంటలకు నెల్లికల్లులో ముఖ్యమంత్రి ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు హాలియాలో జరిగే బహిరంగసభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు.

- Advertisement -