- Advertisement -
కరోనాతో అతలాకుతలమైన ఆర్ధిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో పూర్తిస్ధాయి షూటింగ్‌లు నడుస్తుండగా తాజాగా కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం కూడా 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుపుకొవచ్చని జీవో జారీ చేసింది.
థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో 100 శాతం సీట్లను నింపుకోవడానికి అనుమతి ఇస్తున్నట్లు జీవో పేర్కొంది. దీంతో థియేటర్ ఓనర్లు, నిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది అక్టోబర్‌లోనే థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చినా.. ఇప్పటి వరకూ కేవలం 50 శాతం కెపాసిటీతోనే నడపడానికి అనుమతి ఉండేది. ఇటివలే కేంద్రం ఫిబ్రవరి 1 నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుపుకోవచ్చని చెప్పిన సంగతి తెలిసిందే.
- Advertisement -