- Advertisement -
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు అగ్రరాజ్యం అమెరికా మద్దతు ప్రకటించింది. వ్యవసాయ రంగంలో భారతప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల వలన రైతులకు మేలు జరుగుతుందని అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి తెలిపారు. భారత్ మార్కెట్ల సామర్ధ్యాన్ని పెంచేలా, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేలా ఉన్నాయని …వ్యవసాయ చట్టాల వలన రైతుల మార్కెట్ పరిధి పెరుగుతుందని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో శాంతియుత ప్రదర్శనలు మాములే అని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని అభిప్రాయపడ్డారు.
గత 71 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. రైతుల ఆం దోళనకు అంతర్జాతీయ సెలెబ్రిటీలు మద్దతు తెలపగా తాజాగా అమెరికా ప్రభుత్వం సాగు చట్టాలపై కేంద్రం తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలిపింది.
- Advertisement -