సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన ఢిల్లీ సరిహద్దులో కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రైతులను కలిసేందుకు వెళ్లిన విపక్ష నేతలు, ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో రైతులను కలవకుండానే వెనుదిరిగారు ఎంపీలు.
ఉదయమే రైతుల ఆందోళనకు సంఘీభావం తెలుపుతూ ఢిల్లీ సరిహద్దు ఘజిపూర్ కు బయలుదేరారు 10 పార్టీలకు చెందిన 15 మంది ఎంపీల బృందం. ఈ బృందంలో ఎన్సీపీ ఎంపీ సుప్రియ సులే, డిఎంకే ఎంపీ కనిమొళి, టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్, శిరోమని అకాలీదల్ ఎంపీ హర్ సిమ్రాత్ కౌర్ బాదల్ సహా పలువురు కీలక నేతలు ఉన్నారు.
ఈ సందర్భంగా రైతుల ఆందోళనపై పార్లమెంట్లో మాట్లాడేందుకు స్పీకర్ అనుమతించడంలేదని శిరోమణి అకాలీదల్ ఎంపీ హర్ సిమ్రాత్ కౌర్ బాదల్ ఆరోపించారు.రైతులతో మాట్లాడాక సరిహద్దుల్లో జరుగుతుందేంటో పూర్తిగా వివరిస్తామని తెలిపారుజ