పెట్రోల్ ధరలపై బీజేపీ ఎంపీ సెటైర్…!

211
bjp
- Advertisement -

దేశంలో రోజురోజుకు పెట్రోల్ ధరలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సెంచరీ మార్క్ దాటగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఆ పార్టీ ఎంపీ సుబ్రమణ్య స్వామి.

ట్విట్టర్‌లో ఓ ఫోటోని షేర్‌ చేసిన సుబ్రమణ్యస్వామి…. ఇందులో రామ జన్మభూమిగా భావించే ఇండియాలో లీటర్‌ పెట్రోల్‌ ధర 93 రూపాయలు.. సీతమ్మవారు పుట్టిన దేశం నేపాల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర 53 రూపాయలు.. రావణుడి లంకలో పెట్రోల్‌ లీటర్‌ 51 రూపాయలు మాత్రమే అంటూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -