విద్యాశాఖ సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత . హైదరాబాద్‌లో విద్యాశాఖ సమగ్ర శిక్షా అభియాన్(TSS) జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఎమ్మెల్సీ కవితను కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను కవితకు విన్నవించారు.
విద్యాశాఖ ముఖ్యకార్యదర్శితో మాట్లాడి జీతాల పెంపుపై న్యాయం చేస్తామన్నారు. టీఎస్ఎస్‌లో విధులు నిర్వహిస్తున్న వివిధ విభాగాలకు చెందిన 20 వేల పట్టభద్ర ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ కొత్త పీఆర్సీకి అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం అందేలా చూడాలని కోరగా సానుకూలంగా స్పందించారు కవిత.
కాంట్రాక్టు మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా కాంట్రాక్టు ఉద్యోగులు అందరికీ హెల్త్ కార్డ్స్ ఇవ్వాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులందరికి ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త మండలాలు ఏర్పచిన దృష్ట్యా సమగ్రశిక్ష ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి, ఎంఐసీ కోఆర్డినేటర్స్ ప్రెసిడెంట్ సురేందర్, సీఆర్ ప్రెసిడెంట్ యాదగిరి, సీసీవో నాయకులు రాజేందర్, నాయకులు రమేష్, నరేష్ సంపత్, సమ్మయ్య, కుమార్, శ్రీనివాస్, హకీమ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.