- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన వరంగల్ అర్బన్ డీఎంహెచ్‌వో లలిత దేవి.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ సమాజం కోసం సీఎం కెసిఆర్ ప్రారంభించిన హరిత హరం కార్యక్రమంకి తోడుగా ఎంపీ జోగినీపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతో అద్భుతంగా ముందుకు సాగుతుందన్నారు. అందులో భాగంగా ఈరోజు మొక్కలు నాటడం జరిగింది… మొక్కలు అనేవి మనకు చాలా అవసరం….వాతావరణ కాలుష్యం తగ్గాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి కోరారు. ఇంతమంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్‌కి కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -