కేసీఆర్ ఆలోచనలతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి..

195
koppula eshwar
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలు, పక్కా ప్రణాళికతో గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.గొల్లపల్లి పట్టణ కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు మంత్రి కొప్పుల ఈశ్వర్‌. ఈ రోజు జగిత్యాల జిల్లా గొల్లపల్లి పట్టణం కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా అంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, డీఎంఎఫ్‌టీ, ఎస్‌డీఎఫ్‌ నిధులతో 47.20 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్లు మరియు గంగ పుత్ర సంఘ భవనానికి ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. అనంతరం తెలంగాణ వార్డు మెంబర్ల ఫోరం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు మంత్రి కొప్పుల ఈశ్వర్.

- Advertisement -