క్రికెట్‌ను ఇష్టపడేవారిలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పేరు తెలియని వారు ఉండకపోవచ్చు. ఈ ఆటగాడు లాక్‌డౌన్ సమయంలో సౌత్ సినిమా హీరోలను ఫాలో కావడం మొదలు పెట్టాడు. హైదరాబాద్ సన్ రైజర్స్‌తో క్రికెట్ ఆడటం వల్ల ఏర్పడిన అనుబంధం కావచ్చు మరేదైనా కావచ్చు. కానీ వార్నర్‌కు దక్షిణాదితో సంబంధం ఏర్పడింది. ఇక అప్పటినుండి తెలుగు సినిమాలను బాగా ఫాలో అవుతుంటాడు. అందుకే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తెలుగు సినీ హీరోలను అనుకరిస్తూ టిక్ టాక్ వీడియోలు చేస్తుంటాడు.
తాజాగా, మెగాస్టార్ చిరంజీవి ఆచార్యలా మారిపోయాడు. రీఫేస్ యాప్ సాయంతో ఆచార్యలా తయారైన వార్నర్… అచ్చం మెగాస్టార్ ను తలపించేలా డైలాగులు చెప్పడం చూడొచ్చు.ఈ తాజా వీడియో అభిమానులను విశేషంగా అలరిస్తోంది. లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన ఈ ఆసీస్ క్రికెటర్ మహేశ్ బాబు, ప్రభాస్ వంటి హీరోలను అనుకరిస్తూ స్పూఫ్ లు, అల్లు అర్జున్ పాటలకు డ్యాన్సులు చేస్తూ సోషల్ మీడియాలో బాగా సందడి చేశాడు.