రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదివారం నిర్మల్ బస్ స్టాండ్‌లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుట్టిన ప్రతి బిడ్డ నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు.ప్రభుత్వం బస్ స్టాండ్ లలో, రైల్వే స్టేషన్ లలో కేంద్రాలను ఏర్పాటు చేసిందని అన్నారు.మూడు రోజుల వరకు కేంద్రాలు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు.
అనంతరం బస్ స్టాండ్ లోని కార్గో పార్సిల్ కేంద్రాన్ని మంత్రి సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట జడ్పీ చైర్పర్సన్ విజయ రాంకిషన్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, టౌన్ ప్రెసిండెంట్ మారుగొండ రాము, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్లు చౌస్, సలీం, డీఎం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.