శామీర్‌పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్‌పోలియో కార్యక్రామన్ని మంత్రి మల్లారెడ్డితో కలిసి ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో 38,31,907 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నామని ఆయన చెప్పారు. దీనికోసం 23,331 పోలియో బూత్‌లు ఏర్పాటు చేశామన్నారు. మరో 877 మొబైల్ టీమ్‌లను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.
ఐదేండ్లలోపు చిన్నారుకు పోలియో చుక్కలు వేయించాలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. పల్స్ పోలియో ముగిసిన వెంటనే కరోనా వ్యాక్సిన్ కూడా వేస్తామని చెప్పారు. మీడియా సిబ్బందికి కూడా కరోనా టీకా అందించాలని శనివారమే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. ఈ విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. శామీర్‌పేట దవాఖానను త్వరలో ట్రామా కేర్ సెంటర్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాజీవ్ రహదారి మీద ప్రమాదాలు పెరిగాయని, గాయపడిన వారి ప్రాణాలు కపడతామన్నారు మంత్రి ఈటెల రాజేందర్.