గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన నటి హర్షిత వెంకటేష్..

195
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నటుడు ప్రీతమ్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి ఈరోజు జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటారు బుల్లితెర నటి హర్షిత వెంకటేష్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొక్కలు నాటడం చాలా ముఖ్యమని భవిష్యత్ తరాల కోసం మనందరం బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. మనకు స్థలం లేని పక్షంలో టెర్రస్ గార్డెన్స్, హౌస్ గార్డెన్స్ లు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు.

అందరు కూడా ఏదో ఒక రకంగా మొక్కలు పెంచడం కోసం బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఛాలెంజ్ ఇదేవిధంగా కొనసాగాలని అందుకోసం నేను మరొక ముగ్గురు మనీష్, రష్మీ ,మైతిలి లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -