- Advertisement -
ఫ్రాన్స్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో స్పందించారు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్. 65 ఏళ్ల వయసు దాటిన వారికి ఆస్ట్రాజెన్ టీకా పనిచేయడం లేదన్నారు. 60 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిలో ఆస్ట్రాజెన్‌కా ఫలితాలు ఆశాజనకంగా లేవని గుర్తించినట్లు వెల్లడించారు.
టీకా వినియోగంపై యురోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఫ్రెంచ్ నిపుణులు కూడా ఆ టీకా వినియోగంపై ప్రకటన చేయనున్నారు. తన వద్ద డేటా లేదని, శాస్త్ర బృందం కూడా లేదని ఆయన అన్నారు. మొత్తంగా ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ, బ్రిటన్ కంపెనీ ఆస్ట్రాజెన్‌కా అభివృద్ధి చేసిన టీకాపై సమగ్రమైన సమాచారం లేదని, అయితే 65 ఏళ్లు దాటిన వారిలో ఆ టీకా ప్రభావం అంతగా లేదని వెల్లడించారు.
- Advertisement -