ప్రతీ శుక్రవారం హరిత శుక్రవారం..

507
Kukatpally ZC Mamatha
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ మమత ప్రశంశించారు. ఈ రోజు ఆమె కూకట్‌పల్లిలోని మూసాపేట్ పార్క్‌లో మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆమె ప్రతి శుక్రవారం హరిత శుక్రవారంగా మొక్కలు పర్యవేక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ నాటిన మొక్కలు సంరక్షించాల్సిందింగా అధికారులను ఆదేశించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. నాటిన మొక్కలకు నీరు పోసి, అది ఎదిగే వరకు బాధ్యత తీసుకోవల్సిందింగా కోరారు. ఇందులో భాగంగా మన రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతో గొప్ప ఆలోచన అని అది విజయవంతంగా ముందుకు సాగడంలో అందరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపుఇచ్చారు. ప్రతి శుక్రవారం హరిత శుక్రవారంగా మొక్కలు పర్యవేక్షణ కార్యక్రమం విజయవంతంగా ప్రారంభించారు.

- Advertisement -