- Advertisement -
కాంగ్రెస్ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్ధానం…రేవంత్ పిటిషన్‌ను కొట్టివేసింది.
ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక శాఖ పరిధిలోకి రాదంటూ రేవంత్ పిటిషన్ దాఖలు చేయగా ఆయన తరపు న్యాయవాది వాదనలు విన్న న్యాయస్ధానం ఈ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఈ కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేసింది.
2015లో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్ రెడ్డి…అప్పటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెడుతూ రూ.50 లక్షలు ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
- Advertisement -